Alembic Pharma ఎపిలెప్సీ చికిత్సకు ఉపయోగించే కార్బమాజిపిన్ టాబ్లెట్లు కి USFDA అనుమతి లభించింది. అమెరికా మార్కెట్‌లో దీని విలువ సుమారు $32 మిలియన్ . కంపెనీకి ఇది ఎగుమతుల వృద్ధికి బలాన్నిస్తుంది. IDFC First Bank Warburg Pincus (Currency Investments) మరియు ADIA (Platinum Invicta) ₹7,500 కోట్ల పెట్టుబడిని ₹60 షేర్ ధర వద్ద CCPS రూపంలో ఇన్వెస్ట్ చేస్తున్నాయి. CEO వి. వైద్యనాథన్ ప్రకారం బ్యాంక్ లాభదాయకత దిశగా కదులుతోంది. Sona BLW Precision Forgings ఓ ప్రధాన అంతర్జాతీయ క్లయింట్ నుండి ఆర్డర్లు తగ్గడం వల్ల ఆదాయంలో తగ్గుదల వస్తుందని అంచనా. షేరు ధరలో దాదాపు 11% పతనం . Infosys Q4 ఫలితాలు రెవెన్యూ మరియు మార్జిన్ల పరంగా అంచనాలకు తక్కువగా ఉన్నప్పటికీ, లాభం కొద్దిగా మెరుగ్గా ఉంది. అయితే, కంపెనీ 6 భారీ కస్టమర్లు కోల్పోయింది . వృద్ధి గైడెన్స్ 0-3%. ₹2 డివిడెండ్ ప్రకటించారు. Waaree Renewable Technologies కంపెనీ ఫలితాలు అద్భుతంగా ఉన్నాయి – 82% రెవెన్యూ వృద్ధి , 50% ఆపరేటింగ్ లాభ వృద్ధి, 57% నికర లాభ వృద్ధి. బలమైన ఆర్డర్ బుక్‌తో షేరు భారీగా పెరిగింది. HDFC AMC Q4లో రెవెన్యూ 28% ,...